కేసీఆర్ గతంలో మాదిరిగానే ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు: ఆది శ్రీనివాస్
- కేసీఆర్‌పై విశ్వాసం లేకపోవడం వల్లే ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్య
- పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టింది ఎవరో అందరికీ తెలుసునన్న కాంగ్రెస్ నేత
- ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కనుందన్న ఆది శ్రీనివాస్
ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్ట్ లోగా రూ.31 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కనుందన్నారు. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. రైతు భరోసాపై తమ ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలే కనిపించాయని మండిపడ్డారు.