కీరవాణికి చిరంజీవి బ‌ర్త్‌డే విషెస్‌.. పాత రోజులు గుర్తొచ్చాయంటూ ప్ర‌త్యేక వీడియోను షేర్ చేసిన చిరు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కీరవాణికి చిరంజీవి బ‌ర్త్‌డే విషెస్‌.. పాత రోజులు గుర్తొచ్చాయంటూ ప్ర‌త్యేక వీడియోను షేర్ చేసిన చిరు!

Chiranjeevi Birthday Wishes to Music Director MM Keeravani
  • నేడు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీరవాణి పుట్టిన‌రోజు
  • 'ఎక్స్' వేదిక‌గా కీర‌వాణికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన మెగాస్టార్‌
  • విశ్వంభ‌ర సినిమా తాలూకు మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోను పంచుకున్న చిరు
నేడు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ విజేత‌ ఎంఎం కీరవాణి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ, వివిధ రంగాల‌కు చెందిన ప్రముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా  మెగాస్టార్ చిరంజీవి కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కీర‌వాణికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. "ఈ రోజే జన్మించిన  మా 'ఆస్కారుడు' ఎం.ఎం. కీరవాణికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!" అంటూ చిరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ వీడియోను కూడా జోడించారు. 

'విశ్వంభ‌ర' సినిమా తాలూకు మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోలో ఉంది. ఈ వీడియోను చిరంజీవి త‌న గాత్రంతో పంచుకోవ‌డం విశేషం. తనకు పాత రోజులు గుర్తొచ్చాయంటూ ఈ వీడియోను షేర్ చేసి.. కీరవాణి బ‌ర్త్‌డే స్పెషల్ అంటూ ఆయనకు విషెస్ చెప్పారు.

“గతంలో సినిమాలకు పాటలు కంపోజ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అందరూ మూవీ టీమ్ కూర్చొని పాటల గురించి చర్చించుకుని ఫైనల్ చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. విశ్వంభర సినిమాతో మళ్లీ ఆ ఆనవాయితీ తీసుకొచ్చారు. మా ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన టీమ్‌తో కలిసి విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టారు” అంటూ చెప్పుకొచ్చారు. 

ఈ ప్రోగ్రామ్‌లో మెగాస్టార్‌తో పాటు డైరెక్టర్ వశిష్ఠ, మిగతా మూవీ టీమ్ పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
Chiranjeevi
MM Keeravani
Birthday Wishes
Tollywood

More Telugu News