YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

YS Sharmila meets TS CM Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిలకు సీఎం శాలువా కప్పి సత్కరించారు. పుష్పగుచ్ఛం అందించారు.

షర్మిల ఆ తర్వాత, ప్రజాభవన్‌లో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కలిశారు. ఆయనను కూడా జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. జులై 8న విజయవాడలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ వేడుకలకు ఆమె పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా ఆహ్వానించారు.
 
Go Back to Shorts
YS Sharmila
Revanth Reddy
Mallu Bhatti Vikramarka
Ponnam Prabhakar
Congress

More Telugu News