రేవంత్ రెడ్డి ఎంతటి మొగోడో... ఆ రోజే అర్థమైంది: కేటీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్
- రేవంత్ రెడ్డి మొగోడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ సవాల్
- 61 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుందని కాంగ్రెస్ కౌంటర్
- మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించిన మీ తండ్రి మొగోడో కాదో.. చెప్పాలని చురక
'61 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను… బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసి… రాజీనామా చేయనోడికి… మంత్రి పదవి కట్టబెట్టి… ఒక్కరితో కూడా రాజీనామా చేయించని (ఎమ్మెల్యే పదవికి)… నీ తండ్రి మొగోడు ఔనో కాదో… ముందు చెప్పు టిల్లూ' అంటూ ప్రశ్నించింది.
'రేవంత్ రెడ్డి ఎంతటి మొగోడో… నీకు, నీ అయ్యకు ఎట్లాంటి మొగుడో… అధికార మదంతో… కన్నుమిన్ను కానకుండా…
విర్రవీగుతున్న… నీది, నీ అయ్యది నడ్డివిరిచి… గద్దె దించిన నాడే… తెలంగాణకు అర్థమైంది' అని పేర్కొంది.