మోదీని, బీజేపీని ఓడించాలని అంతర్జాతీయ శక్తులు కుట్ర చేశాయి: కిషన్ రెడ్డి
- సికింద్రాబాద్ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని ఆగ్రహం
- నాంపల్లిలో కాంగ్రెస్ కోసం మజ్లిస్ పని చేసిందని ఆరోపణ
- నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని వ్యాఖ్య
ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మెజార్టీ రాలేదన్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కోసం మజ్లిస్ పని చేసిందని ఆరోపించారు. అందుకే, నాంపల్లిలో కాంగ్రెస్ ప్రచారమే నిర్వహించలేదన్నారు.
నాంపల్లిలో బీజేపీకి ఏకంగా 62 వేల ఓట్లు తగ్గాయని... అయినప్పటికీ ప్రజామద్దతుతో భారీ విజయం సాధించామన్నారు. ప్రధాని మోదీని ప్రపంచ దేశాధినేతలు ఆదరిస్తున్నారన్నారు. వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారన్నారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తామే అన్నారు.