Kalki 2898 AD: 'క‌ల్కి'లోని కాంప్లెక్స్ సాంగ్ విడుద‌ల‌!

Ta Takkara Video Song from Kalki 2898 AD Movie
షార్ట్స్‌లో చూడండి
ఈ గురువారం (27న‌) విడుద‌లైన 'క‌ల్కి 2898 ఏడీ' మూవీ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో ఈ మూవీలో ప్ర‌భాస్, దిశా ప‌టానీ 'కాంప్లెక్స్'లో చిందులేసిన 'ట ట‌క్క‌ర' వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇక ఈ పాట‌లో లొకేష‌న్స్‌, డార్లింగ్ ప్రభాస్ వేసిన సింపుల్ స్టెప్స్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా న‌టి ఫ‌రియా అబ్దుల్లా, డైరెక్ట‌ర్ అనుదీప్ నిలిచారు. 

క‌లెక్ష‌న్ల‌లో దుమ్మురేపుతున్న 'క‌ల్కి'
ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. మొద‌టి రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 191.5 కోట్లు రాబ‌ట్టగా, రెండో రోజు రూ. 107 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు వైజ‌యంతీ మూవీస్ ప్ర‌క‌టించింది. దీంతో రెండు రోజుల్లో మొత్తం రూ. 298.5 కోట్లు సాధించింది. శ‌ని, ఆదివారం వీకెండ్స్ కావ‌డంతో వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉందని సినీవ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో మ‌రో రెండు రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు సులువుగా రూ. 550 కోట్లు దాటేస్తాయ‌నే టాక్ న‌డుస్తోంది.

Go Back to Shorts
Kalki 2898 AD
Prabhas
Nag Ashwin
Tollywood

More Telugu News