రోడ్లు బాగుంటేనే టోల్ వసూలు చేయాలి.. లేదంటే వ్యతిరేకత తప్పదు: నితిన్ గడ్కరీ
- అధ్వాన రోడ్లకు కూడా టోల్ వసూలు చేయడం మానుకోవాలన్న గడ్కరీ
- నాణ్యమైన సేవలు అందించకుండా చార్జీలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్న
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపగ్రహ ఆధారిత టోల్ చార్జీలు!
మన ప్రయోజనాల కోసం యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఆత్రుతగా ఉంటున్నామని గడ్కరీ విమర్శించారు. నాణ్యమైన రోడ్లు అందించినప్పుడు మాత్రమే టోల్ వసూలు చేయాలని సూచించారు. బురద, గుంతలతో నిండిన రోడ్లకు కూడా చార్జీలు వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని పేర్కొన్నారు.