స్పీకర్ ఏకగ్రీవానికి సహకరిస్తామని చెప్పాం, కానీ.. : రాహుల్ గాంధీ
- ఈ విషయంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను రాజ్ నాథ్ సంప్రదించారని వెల్లడి
- డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని అడిగామన్న కాంగ్రెస్ అగ్రనేత
- అధికార పక్షం నుంచి స్పందన లేకపోవడంతోనే సురేశ్ ను నిలబెట్టినట్లు వివరణ
లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం ఆనవాయతీ అని, యూపీఏ హయాంలో తాము దీనిని పాటించామని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కోరిన అధికారపక్షం.. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు. ఓవైపు స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరించాలని అడుగుతూనే.. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను అవమానిస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.