40 సెకన్లలోనే మేడ్చల్ బంగారు దుకాణంలో దోపిడీ: సైబరాబాద్ సీపీ
- మేడ్చల్‌లోని బంగారం దుకాణంలో ఈ నెల 20న దోపిడీకి పాల్పడ్డారన్న సీపీ
- ఒకరు బురఖాలో... మరొకరు హెల్మెట్ ధరించి వచ్చారని వెల్లడి
- నిందితులను పట్టుకోవడానికి 16 బృందాలను ఏర్పాటు చేశామన్న సీపీ
నిందితులు పారిపోవడంతో 200 సీసీ కెమెరాలను పరిశీలించినట్లు చెప్పారు. కిలో మీటరు దూరంలో బైక్ పెట్టి వారు పరారయ్యారని పేర్కొన్నారు. వారు ఓయూ, హబ్సిగూడలో బైక్‌లను దొంగిలించినట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి 16 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితులను నజీం, సోహైల్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. ఇటీవల చాదర్‌ఘాట్‌లో జరిగిన చోరీలోనూ వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామన్నారు.