నేను తక్కువ మాట్లాడతా... మీకు ఎక్కువ అవకాశం ఇస్తా: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- ఏపీ 16వ శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు
- సభను ఉద్దేశించి మాట్లాడిన అయ్యన్న
- సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచన
- 16వ అసెంబ్లీకి గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని విజ్ఞప్తి
"ప్రజలు మనకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహిళా ఎమ్మెల్యేలు, ఉన్నత విద్యావంతులు, కొత్త మంత్రులు ఉన్నారు. నేను ఈ సభలో తక్కువ మాట్లాడతా, మీకు ఎక్కువ అవకాశం ఇస్తా. ప్రజలకు పనికొచ్చే విధంగా అందరం కలిసి ఈ సభను గౌరవ సభగా నడిపించుకుందాం" అని అయ్యన్న పేర్కొన్నారు.
ఇక, ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవి. ఈ సమావేశాలు నిన్న (జూన్ 21) ప్రారంభం అయ్యాయి. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక చేపట్టారు.