తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత!
- నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూల్చివేసిన సీఆర్‌డీఏ అధికారులు
- నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నందుకే చర్యలు తీసుకున్నామని వివరణ
- భవనం కూల్చేయాలన్న సీఆర్‌డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
కూల్చే సమయంలో అటుగా కార్యకర్తలు, నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్‌డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీఆర్‌డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్‌డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది.