కడపలో అందుకే ఓడిపోయాను... హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ చేశా: వైఎస్ షర్మిల
- కడపలో తన ఓటమికి 'టైమ్' కారణమన్న షర్మిల
- తాను కడపలో మొత్తం తిరగలేకపోయానని వ్యాఖ్య
- కడపలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపణ
- హంతకుల పాపం పండేరోజు వస్తుందన్న షర్మిల
కడపలో పరిస్థితులు అంతా వేరుగా ఉన్నాయన్నారు. కడపలో అప్పటికే వైసీపీ నుంచి ఎంపీ ఉన్నారని... ఎమ్మెల్యేలు ఉన్నారని... అప్పుడు వైసీపీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. దీంతో అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలిస్తే తమకు వచ్చే పథకాలు పోతాయని... కేసులు పెడతారని... దాడులు చేస్తారనే భయం ప్రజల్లో ఉందన్నారు. అదే సమయంలో ఓటుకు రూ.3,500 నుంచి ఆ పైన ఇచ్చారన్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచారన్నారు. డబ్బులు పని చేయని చోట బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.
హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే...
హంతకులు మరోసారి చట్టసభలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో మాత్రమే తాను పోటీ చేశానని షర్మిల తెలిపారు. తన లక్ష్యం నెరవేరకపోవచ్చు కానీ... ప్రజల కంటే పైన దేవుడు ఉన్నాడని... వారి పాపం పండుతుందన్నారు. వారి పాపం పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని తాను భావిస్తున్నానన్నారు.