ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు: కేంద్రం ఆదేశాలు
- ఆలస్యంగా రావడం, బయోమెట్రిక్ నమోదు చేయకపోవడంపై కేంద్రం సీరియస్
- తరచూ ఆలస్యంగా వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
- ఒక్క రోజు ఆలస్యమైతే ఒక సీఎల్ తొలగించాలని సూచన
‘‘ఆలస్యంగా వచ్చిన ఒక్కో రోజుకు ఒక పూట సాధారణ సెలవు చొప్పున కోతపెట్టాలి. ఒకవేళ సీఎల్‌లు లేకపోతే ఆర్జిత సెలవుల నుంచి తగ్గించాలి. తగిన కారణాలు ఉన్నట్టయితే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా ఆలస్యంగా రావడాన్ని క్షమించవచ్చు. ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లిపోవడాన్ని ఆలస్యంగా రావడంతో సమానంగానే పరిగణించాలి’’ అని తాజాగా ఉత్తర్వుల్లో తెలిపింది.