ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
- రేపు బక్రీద్ పండుగ
- మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపజేసే పండుగ అంటూ చంద్రబాబు ప్రకటన
- బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహారం వితరణ చేస్తానని వెల్లడి
బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహారం వితరణ చేస్తానని వెల్లడించారు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమైక్యత, సమానత్వాన్ని సాధిద్దాం అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.