అధికారుల బదిలీలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు
- ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
- ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళనపై దృష్టి
- కళంకిత అధికారులను దూరం పెట్టే యోచనలో సీఎం
- సమర్థత, చిత్తశుద్ధి ఉన్న అధికారులకే కీలక పోస్టింగులు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబును అనేకమంది అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కొందరు వివాదాస్పద అధికారులు చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి.
పలువురు అధికారులకు అనుమతి లభించలేదని, ఎలాగోలా ఒకరిద్దరు అధికారులు చంద్రబాబును కలిసినప్పటికీ వారి నుంచి బొకేలు తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారని సమాచారం. దీనికి సంబంధించి వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.