Kannappa: మంచు విష్ణు కన్నప్ప టీజర్ విడుదల... థియేటర్లలో మాత్రమే!

Manchu Vishnu Kannappa teaser out now only in theatres
  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం
  • ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం
  • ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో టీజర్ ఆవిష్కరణ
  • నేడు యూట్యూబ్ లో కాకుండా ఎంపిక చేసిన థియేటర్లలోనే టీజర్ రిలీజ్
టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల కన్నప్ప టీజర్ ను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఆవిష్కరించారు. నేడు ఈ టీజర్ ను భారత్ లో విడుదల చేశారు. 

అయితే, యూట్యూబ్ లో కాకుండా, కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలోనే ప్రదర్శితమయ్యేలా కన్నప్ప టీజర్ ను విడుదల చేశారు. 

మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మధుబాల వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. కన్నప్ప చిత్రం అత్యధిక భాగం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంది.
Kannappa
Teaser
Manchu Vishnu
Theatres
Tollywood

More Telugu News