Nara Lokesh: తనకు శాఖల కేటాయింపుపై నారా లోకేశ్ స్పందన

Nara Lokesh opines on portfolios allotment
  • నేడు ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
  • లోకేశ్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, ఆర్టీజీ శాఖలు
  • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన
  • ఈ అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నానని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ కు నేడు శాఖల కేటాయింపులో భాగంగా... మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) శాఖలు కేటాయించారు. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. 

హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. 

"నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. 

యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నేను గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను" అని లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
AP Minister
Portfolios
TDP
Andhra Pradesh

More Telugu News