Raghu Rama Krishna Raju: దొంగే.. దొంగా దొంగా అన్నట్టుంది.. వైసీపీపై రఘురామ ఫైర్

Raghurama Krishnaraju lashes out at YCP leader
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నేతల తీరుపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. దొంగే.. దొంగా దొంగా అన్నట్టు వైసీపీ నేతల తీరు ఉందని అన్నారు. ‘‘ఎవరూ ఎవరినీ ఏమీ అనకముందే వారిని కొట్టారంటూ ఢిల్లీలో విజయసాయిరెడ్డి పెడబొబ్బలు పెడుతున్నారు. గతంలో వారు చేసినట్లు ఎన్డీయే పాలనలోనూ దాడులకు పాల్పడతారన్న భయంతో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్దఅమిరంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టి, పట్టపగలే ఇంట్లోంచి ఎత్తుకెళ్లి అర్ధరాత్రి వరకూ తిప్పుతూ కొట్టారు. దీనిపై ఆధారాలున్నా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా ఎన్నో దుర్మార్గాలను చేసిన వారు నేడు ఏమీ జరగకముందే ఏదో జరిగిపోతోందన్న అపోహతో ముందుగానే తమని కొడుతున్నారని, చంపేస్తున్నారని పెడబొబ్బలు పెడుతున్నారు’’ అని రఘురామ విమర్శించారు.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News