అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం

Kinjarapu Atchannaidu take oath
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం 
  • ఆయన టెక్కలి నియోజకవర్గం నుంచి 2024లో భారీ మెజారిటీతో విజయం 
  • 1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలుపు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో  గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024 లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుకి అచ్చెన్న సోదరుడు. 1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలిచారు. ఆ తర్వాత కూడా 1999, 2004 లలో హరిశ్చంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు.  2014, 2019 లలో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు.  

Advertisement
Kinjarapu Atchannaidu

More Telugu News