మలావి విమానం గల్లంతు విషాదాంతం... ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం
- అదృశ్యమైన విమానం పర్వత ప్రాంతాల్లో కూలినట్లుగా గుర్తింపు
- పర్వత ప్రాంతాల్లో విమాన శకలాలను గుర్తించినట్లు ప్రకటించిన మలావి అధ్యక్షుడు
- ఉపాధ్యక్షుడి మరణం నేపథ్యంలో నేడు సంతాపదినంగా ప్రకటన
సోమవారం ఉదయం రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ఘటనలో దేశ ఉపాధ్యక్షుడు షిలిమాతో పాటు మరో 9 మంది దుర్మరణం పాలుకావడం బాధాకరమని మలావి అధ్యక్ష కార్యాలయం, కేబినెట్ కార్యాలయం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.