నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ... ఎందుకంటే...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ... ఎందుకంటే...!

Scottish woman sues Netflix
  • నెట్ ఫ్లిక్స్ లో హిట్టయిన బేబీ రెయిన్ డీర్ వెబ్ సిరీస్
  • కమెడియన్ రిచర్డ్ గాడ్ అనుభవాల ఆధారంగా తెరకెక్కిన సిరీస్
  • అందులో తన గురించి తప్పుగా చూపించారన్న మహిళ
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పై ఓ మహిళ భారీ మొత్తంలో దావా వేయడం ఆసక్తి కలిగిస్తోంది. స్కాట్లాండ్ కు చెందిన ఆ మహిళ పేరు ఫియోనా హార్వే. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న 'బేబీ రెయిన్ డీర్' అనే వెబ్ సిరీస్ తన జీవిత కథ ఆధారంగానే తెరకెక్కించారని, హాస్యనటుడు రిచర్డ్ గాడ్ చెప్పిన ఆ కథను నిర్ధారించుకోకుండానే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గా మలిచిందని ఫియోనా హార్వే ఆరోపించారు. 

నిజ జీవిత గాథ అంటూ ప్రచారం చేసుకున్నారని, కానీ అందులో నిజానిజాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా అందులో కొన్ని సీన్లు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో ఆమె నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. 

మార్తా స్కాట్ అనే మహిళ ద్వారా తాను ఎలా వేధింపులకు గురయ్యాడో కమెడియన్ రిచర్డ్ గాడ్ చెప్పిన అనుభవాల మేరకు ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ 'బేబీ రెయిన్ డీర్' సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

అయితే, ఇందులో తనను ఓ నేరస్తురాలిగా ముద్ర వేశారని, వేధింపుల కారణంగా జైలుకు వెళ్లినట్టు, కమెడియన్ రిచర్డ్ గాడ్ పై తాను లైంగిక దాడికి పాల్పడినట్టు చూపించారని ఫియోనా హార్వే ఆరోపించింది. ఈ వెబ్ సిరీస్ నిండా దారుణమైన అబద్ధాలు ఉన్నాయని తెలిపారు. 

నెట్ ఫ్లిక్స్ మాత్రం హార్వే ఆరోపణలకు తలొగ్గేది లేదని స్పష్టం చేస్తోంది.  తన జీవితంలో ఏం జరిగిందో చెప్పే హక్కు కమెడియన్ రిచర్డ్ గాడ్ కు ఉందని, అతడి జీవిత అనుభవాలనే తాము చూపించామని తేల్చి చెప్పింది.
Advertisement
Netflix
Fiona Harvey
Scotland
USA

More Telugu News