కొంతమంది క్యాబినెట్ బెర్త్‌లంటూ బురిడీ కొట్టిస్తారు... జాగ్రత్త సుమా: ఎంపీలకు మోదీ హెచ్చరిక
- కేబినెట్ బెర్త్ అంటూ చెప్పేవారి కుట్రలకు చిక్కవద్దన్న మోదీ
- ఈ విషయంలో విపక్ష కూటమికి డబుల్ పీహెచ్‌డీ ఉందని ఎద్దేవా
- వదంతులకు దూరంగా ఉండాలని సూచన
కేబినెట్ బెర్త్ అంటూ తన సంతకాలతో కూడిన జాబితా కూడా బయటకు రావొచ్చునని... ఇప్పుడు టెక్నాలజీ ఆ స్థాయిలో ఉందన్నారు. ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసుకోవాలని సూచించారు. అలాంటి వారి కుట్రలకు చిక్కవద్దని కోరారు.
ఈ విషయంలో విపక్ష కూటమికి డబుల్ పీహెచ్‌డీ ఉందని ఎద్దేవా చేశారు. వదంతులకు దూరంగా ఉండాలని... సంచలనాల కోసం ఇలాంటి ప్రయత్నాలతో దేశాన్ని నడిపించలేమన్నారు. ప్రధాని మోదీ నవ్వుతూనే ఈ సూచన చేశారు. ఆయన వ్యాఖ్యలకు కూటమి సభ్యులంతా చిరునవ్వులు చిందించారు. ఎన్డీయే అంటే న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా అని కొత్త అర్థం చెప్పారు.