కింగ్ మేకర్ అయితే బీహార్ కు ప్రత్యేక హోదా అడగాలి: తేజస్వీ యాదవ్
- బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కు ఆర్జేడీ నేత డిమాండ్
- ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన జేడీయూ
- దేశంలో మోదీ మ్యాజిక్ ముగిసిపోయిందన్న తేజస్వీ
బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఇక ఎన్డీఏ కూటమిలోని మిత్ర పక్షాలపై మోదీ ఆధారపడాల్సిందేనని అన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి మీటింగ్ కోసం తేజస్వీ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో ఒకే విమానంలో నితీశ్, తేజస్వీ ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.