వివేకా హత్యకేసులో ఓ జంట.. ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి
- రాష్ట్రంలో ఇప్పటి వరకు భారతీరెడ్డి రాజ్యాంగం నడిచిందని ఆరోపణ
- వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మరో 10 శాతం మాత్రమే మిగిలి ఉందన్న బీజేపీ నేత
ఈ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి నిన్న విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భారతీరెడ్డి రాజ్యాంగం నడిచిందని, ప్రజలకు 25 శాతం డబ్బులు పంచిన జగన్.. మిగతావి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే వివేకా హత్య కేసుతోపాటు కోడికత్తి కేసు విషయాన్ని కూడా ప్రస్తావిస్తానని ఆదినారాయణరెడ్డి తెలిపారు.