చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళతా... ఆ తర్వాత ప్రత్యేక హోదాపై మాట్లాడుతా!: రేవంత్ రెడ్డి
- రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారన్న రేవంత్ రెడ్డి
- ఈ అంశంపై పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడుతానని స్పష్టీకరణ
- ఏపీలో ఎవరు వచ్చినా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని ముందే చెప్పానన్న సీఎం
ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగా రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.