ఒకే ఫ్లైట్ లో ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలు నితీశ్, తేజస్వీ
- ఢిల్లీలో జరిగే సమావేశాలకు బయలుదేరనున్న బీహార్ నేతలు
- ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్ కుమార్
- మాజీ సహచరుడితో ప్రయాణంపై టెన్షన్
ఇండియా కూటమిలో సహచరులుగా, బీహార్ లో కొన్నిరోజుల పాటు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్, తేజస్వీలు ఒకే ఫ్లైట్ లో ప్రయాణించనున్నారు. దీంతో నితీశ్, తేజస్వీల మధ్య చర్చ జరిగే అవకాశం లేకపోలేదని, ఎప్పటికప్పుడు పొత్తులు మార్చడంలో పేరుమోసిన నితీశ్ కుమార్ ఏం చేయనున్నాడోనని రాజకీయ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. కొంతకాలం కిందట సహచరులుగా, ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్న నితీశ్, తేజస్వీలు ఒకే విమానంలో ప్రయాణించడం ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన బీజేపీ వర్గాల్లో నెలకొన్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన వేళ ఈ ప్రయాణం నితీశ్ కుమార్ ను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే.