తెలంగాణలో ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
- జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా
- ఎమ్మెల్సీ పదవికి రాజీనామాతో ఉప ఎన్నిక
- బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్
లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక తప్పనిసరైంది.