వారణాసి నుంచి వరుసగా మూడోసారి గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ
- కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై గెలుపు
- 1,52,513 ఓట్ల తేడాతో ఘన విజయం
- వారణాసి నుంచి మూడోసారి విజయం సాధించిన నరేంద్ర మోదీ
తాజా గెలుపుతో వారణాసి నుంచి వరుసగా మూడోసారి మోదీ ఎంపీగా గెలిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ఎస్‌పీ-బీఎస్‌పీ కూటమి అభ్యర్థిగా నిలిచిన ఎస్‌పీ అభ్యర్థిని షాలినీ యాదవ్‌ను 4,79,505 ఓట్ల తేడాతో మోదీ ఓడించిన విషయం తెలిసిందే.