ఓటమి దిశగా రోజా.. ఫలితాలపై ట్విట్టర్ లో స్పందించిన మంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటమి దిశగా రోజా.. ఫలితాలపై ట్విట్టర్ లో స్పందించిన మంత్రి

AP Minister Roja Reaction On Results Trend
  • చిరునవ్వుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ వేదాంత ధోరణి
  • నగరి నుంచి అసెంబ్లీ బరిలోకి దిగిన రోజా
  • 8 వేల పైచిలుకు ఓట్లతో వెనుకంజ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుగాలి వీస్తున్న సంగతి తెలిసిందే. మంత్రులు సహా వైసీపీ సీనియర్ నేతలు ఫలితాల ట్రెండ్ లో వెనుకబడ్డారు. నగరి నుంచి బరిలోకి దిగిన మంత్రి రోజా కూడా వెనుకంజలోనే ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ 8 వేల ఓట్లతో లీడ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫలితాల ట్రెండ్ పై మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా, ఎదురు దెబ్బలను మెట్లుగా, మన్నింపులను నిర్ణయాలుగా, తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అని పేర్కొన్నారు.
Advertisement
Roja
AP Assembly Poll Results
Nagari
Roja Trail
Tweet

More Telugu News