Eatala Rajender: ఈటల రాజేందర్ తగ్గేదేలే.. లక్షకు పైగా ఆధిక్యం
మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 2,89,989 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1731 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 18,655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.