హాలీవుడ్ న‌టుడు జానీ వాక్ట‌ర్‌ను కాల్చి చంపిన దుండ‌గులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హాలీవుడ్ న‌టుడు జానీ వాక్ట‌ర్‌ను కాల్చి చంపిన దుండ‌గులు!

General Hospital actor Johnny Wactor fatally shot in Los Angeles
  • లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో ఘ‌ట‌న‌
  • వాక్ట‌ర్ ప్ర‌యాణిస్తున్న కారులో అగంతుకులు దోపిడీకి య‌త్నం
  • ఎదురుతిరిగిన అత‌నిపై కాల్పుల‌కు పాల్ప‌డిన వైనం
  • ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ వాక్ట‌ర్ 
  • ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి 
అమెరికాలో దుండ‌గులు మ‌రోసారి రెచ్చిపోయారు. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు జానీ వాక్ట‌ర్‌ (37) ను కాల్చి చంపారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న‌ కారులో దోపిడీకి య‌త్నించిన‌ అగంతు‌కులు కాల్పులు జ‌ర‌ప‌డంతో జానీ వాక్ట‌ర్ చ‌నిపోయాడు. శనివారం తెల్లవారు జామున 3 గంట‌ల ప్రాంతంలో (అమెరికా కాల‌మానం ప్ర‌కారం) లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు వాక్ట‌ర్ త‌ల్లి స్కార్లెట్, పోలీసులు తెలిపారు. 

ముగ్గురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వాక్ట‌ర్ కారు వ‌ద్ద కాట‌లిక్ట్ క‌న్వ‌ర్ట‌ర్‌ను దొంగిలిస్తుండగా ఎదురుతిరిగిన అతనిపై దుండ‌గులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ వాక్ట‌ర్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు స్కార్లెట్ వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే నిందితులు అక్క‌డి నుంచి పారిపోగా పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అరెస్టులు జ‌ర‌గ‌లేద‌ని పోలీసులు తెలిపారు. 

ఇక 2007లో వ‌చ్చిన లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ 'ఆర్మీ వైవ్స్' అనే టీవీ షోతో జానీ వాక్ట‌ర్ త‌న కెరీర్ ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ‘వెస్ట్‌వరల్డ్', 'ది ఓ', 'స్టేషన్ 19', 'క్రిమినల్ మైండ్స్', 'హాలీవుడ్ గర్ల్' వంటి విజ‌య‌వంత‌మైన వెబ్ సిరీస్‌లు, ప‌లు టీవీ షోల‌లో న‌టించాడు.

ముఖ్యంగా 'జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌' అనే షో జానీ వాక్ట‌ర్‌కు ఎన‌లేని గుర్తింపును తెచ్చి పెట్టింది. 1963లో ప్రారంభ‌మైన ఈ షోలో ఆయ‌న 2020 నుంచి 2022 వ‌ర‌కు దాదాపు 200 ఎపిసోడ్స్‌ల‌లో న‌టించాడు. అందులో ఆయ‌న పోషించిన బ్రాండో కార్బిన్ క్యారెక్ట‌ర్ ఇప్ప‌టికీ చాలా మందికి ఫెవ‌రేట్. 

కాగా, జానీ వాక్ట‌ర్ మ‌ర‌ణ వార్త విన్న తోటి న‌టులు, జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌ షో టీం తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వాక్ట‌ర్‌తో వారికి ఉన్న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఇక ఈ వార్త తెలిసిన ఆయ‌న అభిమానులు చాలామంది శోక సంద్రంలో మునిగిపోయారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు నివాళులర్పిస్తున్నారు.
Advertisement
Johnny Wactor
Hollywood
General Hospital
USA
Los Angeles
Crime News

More Telugu News