ప్రియురాలి ఇంటికి ప్రియుడు.. దొంగనుకుని చావబాదిన తండ్రి
- హైదరాబాద్‌లోని పాతబస్తీ బండ్లగూడలో ఘటన
- గతంలో బాలికను ఇంట్లోంచి తీసుకెళ్లిన కేసులో జైలుకు
- 45 రోజుల అనంతరం బయటకు వచ్చిన నిందితుడు
- తాజాగా బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి చిక్కిన వైనం
- భయపడి గదిలోకి వెళ్లి డయల్ 100కు ఫోన్
- తల్లిదండ్రులతో కలిసి వచ్చి విడిపించిన పోలీసులు
బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోహైల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 45 రోజుల అనంతరం జైలు నుంచి ఇటీవల బయటకు వచ్చిన సోహైల్ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో నమాజు కోసం లేచిన బాలిక తండ్రి యువకుడిని చూసి దొంగనుకుని పట్టుకుని చితకబాదాడు. ఆ తర్వాత అతడిని సోహైల్‌గా గుర్తించాడు.
తననేమైనా చేస్తాడేమోనని భయపడిన నిందితుడు వెంటనే ఓ గదిలోకి దూరి డోర్ వేసేసుకున్నాడు. ఆపై డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించాడు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు వారితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి యువకుడిని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.