ఎగిరే కారు వచ్చేసింది.. అలా గాల్లో తేలిపోవచ్చు.. ఎలా ఎగురుతోందో వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎగిరే కారు వచ్చేసింది.. అలా గాల్లో తేలిపోవచ్చు.. ఎలా ఎగురుతోందో వీడియో ఇదిగో!

Hexa flying car show in japan
  • ‘హెక్సా’ పేరిట తయారు చేసిన అమెరికా కంపెనీ
  • గంటకు 100 కిలోమీటర్ల దాకా వేగం..
  • నేలపైనా, నీటిపైనా ల్యాండ్ అయ్యే సామర్థ్యం
రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్‌.. సందు లేకుండా నిండా కార్లు, టూవీలర్లు, వాటి మధ్య బస్సులు, ఇతర వాహనాలు. కాసింత దూరం వెళ్లడానికి కూడా అరగంట, గంట సమయం పడుతుంది. అలా కాకుండా నేరుగా ఎగిరి వెళ్లిపోతే బాగుంటుంది అనిపించని వారు ఎవరూ ఉండరు. అలా వెళ్లాలనుకుంటే.. ఇదిగో ఈ ఎగిరే కారును కొనేసుకుంటే సరి.

పెద్ద సైజు డ్రోన్ తరహాలో..
  • అమెరికాకు చెందిన లిఫ్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ  హెక్సా పేరిట ఒక ఎగిరే కారును తయారు చేసింది. చూడటానికి ఓ పెద్ద డ్రోన్ తరహాలో కనిపించే ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ ఎగిరే కారు ‘హెక్సా’ను ప్రదర్శించారు. దీనిని నడిపిన వ్యక్తి.. పది, పన్నెండు మీటర్ల ఎత్తులోకి కారును తీసుకెళ్లి.. అటూ ఇటూ తిప్పుతూ అందరికీ అభివాదం చేశాడు. 
  • ఈ  ఎగిరే కారు వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీన్ని నేల మీదేకాదు.. నీటిలోనూ ల్యాండ్‌ చేయవచ్చని వివరించింది.
  • గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు ఉన్నాయి. సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా వాటిని అమర్చారు. 
  • మనం వీడియో గేమ్ ఆడుకున్నట్టుగా ఒక చిన్న జాయ్ స్టిక్ సాయంతో దీనిని ఆపరేట్ చేయవచ్చు.
  • ఈ ఎగిరే కారు రీచార్జబుల్‌ బ్యాటరీలతో నడుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల దాకా స్పీడ్ తో వెళ్లగలదని కంపెనీ తెలిపింది.
  • ఇంతకీ దీని రేటెంతో తెలుసా.. జస్ట్ రూ.4.12 కోట్లు మాత్రమేనట. అదీ ఇప్పటికిప్పుడు డెలివరీ చేయడం లేదు. ముందుగా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తే.. అప్పుడు అందిస్తారట. కాకపోతే దీనిలో ఒక్కరు మాత్రమే ప్రయాణించవచ్చు.
  • ఏదైమైనా మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి.. నిమిషాల్లోనే ఆఫీసుకో, మరో చోటికో చేరుకోవచ్చు. ట్రాఫిక్, రోడ్లు ఇతర బాదర బందీలేవు ఉండవు. భవిష్యత్తులో అంతటా ఇలాంటి ఫ్లయింగ్ కార్లు దూసుకుపోవడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.
Advertisement
Flying car
Hexa
USA
offbeat
Viral Videos

More Telugu News