విదేశాలకు ఏపీ నేతల క్యూ.. జగన్, చంద్రబాబు, లోకేశ్.. ఇప్పుడు షర్మిల
- కుమారుడు, తల్లితో గడిపేందుకు యూఎస్‌కు షర్మిల
- ఎన్నికల ఫలితాలకు ముందే తిరిగి నాయకులంతా ఏపీకి
- వైద్య పరీక్షల కోసం బాబు, కుమార్తెలను కలిసేందుకు జగన్ పయనం
చంద్రబాబు వైద్య పరీక్షల కోసం వెళ్లగా, లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెలను కలిసేందుకు జగన్ వెళ్లారు. జగన్ కూడా ఈ నెలాఖరులో తిరిగి ఏపీ చేరుకుంటారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా అమెరికా వెళ్లారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అక్కడే ఉన్న తల్లి వైఎస్ విజయమ్మను కలిసేందుకు వెళ్లారు.
కుమారుడు, తల్లితో కొంతకాలం గడిపిన తర్వాత తిరిగి జూన్ 2న తల్లితో కలిసి షర్మిల వెనక్కి వస్తారని సమాచారం. రెండుమూడు నెలలుగా ఎన్నికల ప్రచారం, వ్యూహాలతో బిజీబిజీగా గడిపిన వీరంతా ఎన్నికలు ముగిసీ ముగియగానే విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, అంతకుముందే వీరంతా ఏపీకి చేరుకుంటారు.