ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్... నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
- ఐపీఎల్ తాజా సీజన్ లో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న ఎస్ఆర్ హెచ్
- ఇప్పటికే ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించిన హైదరాబాద్ టీమ్
- నేడు గెలిస్తే ప్లేఆఫ్స్ లో మెరుగైన స్థానం లభించే అవకాశం
దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి బోడుప్పల్, చెంగిచెర్ల క్రాస్ రోడ్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను భగాయత్ రోడ్డుపై మళ్లిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.