చీకటిని చీల్చుకుంటూ ఆకాశం నుంచి దూసుకొచ్చిన నీలి కాంతి తరంగం!
- ఒక్క క్షణంపాటు చిమ్మచీకటి కాస్తా పట్ట పగలులాగా మార్చిన వైనం
- స్పెయిన్, పోర్చుగల్ గగనతలంపై అరుదైన దృశ్యం ఆవిష్కరణ
- ఆశ్చర్యపోయిన ప్రజలు.. భారీ ఉల్కగా అనుమానం.. నెట్టింట వీడియో వైరల్
అది ఒక భారీ ఉల్క అయ్యుంటుందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంపాటు కాంతి రేఖ కనిపించినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఆ వెలుగు రేఖ ఉల్కాపాతమా కాదా? అది ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడ పడింది అనే విషయాలపై అంతరిక్ష సంస్థలు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అది భారీ ఉల్కేనని.. క్యాస్ట్రో డైరో అనే ప్రాంతంలో పడిందనే ప్రచారం జరుగుతోంది.