KCR: తెలంగాణలో యుద్ధం ఇంకా మిగిలే ఉంది: కేసీఆర్ వ్యాఖ్య

KCR says war remain in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో యుద్ధం ఇంకా మిగిలే ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాజకీయ, సామాజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన 'సన్‌ ఆఫ్ ద సాయిల్' (భూమి పుత్రుడు) పుస్తకాన్ని కేసీఆర్‌ శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో భావవ్యాప్తితో ఉద్యమం ఉద్ధృతమైందన్నారు. మరోసారి కవులు, కళాకారులు ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనదిశగా తీసుకెళుతోందన్నారు. కర్షకులు, కార్మికులు, నిరుద్యోగులు వివిధ వర్గాలు కాంగ్రెస్ పాల‌న‌లో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలకు చిన్న ఇబ్బంది కలగకుండా పాల‌న చేశామ‌న్నారు. 

ఈ సందర్భంగా 'సన్ ఆఫ్ సాయిల్' పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాద‌వ్‌ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ప్ర‌గ‌తిని సాధారణ శైలిలో, ప్ర‌జ‌ల‌కు అర్థమయ్యేలా వివరించారన్నారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని, రచయితలు ప్ర‌జ‌ల‌ పక్షాన ఉండాలని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
KCR
Telangana
BRS
Congress

More Telugu News