జగన్ వెళ్లాల్సింది లండన్ కు కాదు.. యూపీకి వెళ్లాలి: భానుప్రకాశ్ రెడ్డి
- శాంతిభద్రతలను ఎలా కాపాడాలో సీఎం యోగి నుంచి తెలుసుకోవాలన్న భానుప్రకాశ్ రెడ్డి
- వైసీపీని నమ్ముకున్న పోలీసు అధికారులు కెరీర్లో మచ్చ తెచ్చుకున్నారని వ్యాఖ్య
- వైసీపీని రాష్ట్ర ప్రజలు తారు డబ్బాలో ముంచేశారన్న భాను
ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తారు డబ్బాలో ముంచేశారని చెప్పారు. ఎంతో ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం రావణకాష్ఠంగా మార్చిందని మండిపడ్డారు. వైసీపీని నమ్ముకున్న ఎంతో మంది పోలీసు ఉన్నతాధికారులు వారి కెరీర్లో మచ్చ తెచ్చుకున్నారని చెప్పారు. పాత ఎఫ్ఐఆర్ లను కూడా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం అలాంటి అధికారులకు సిగ్గుచేటని అన్నారు.