Jammalamadugu: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గృహ నిర్బంధం

Police House Arrest TDP YCP And BJP Candidates In Jammalamadugu
  • ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగులో ఘర్షణలు
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 500 మంది పోలీసుల మోహరింపు 
  • మాచర్లలోనూ కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు ఇంకా కొనసాగుతుండడంతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని కొలిక్కి తెచ్చేందుకు దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేయడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయం నెలకొంది. నిడిజువ్విలో వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిని, దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడపలో టీడీపీ అభ్యర్థి భూపేశ్‌రెడ్డిని గృహనిర్భంధం చేశారు.

మరోవైపు పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.
Jammalamadugu
YSR District
TDP
YSRCP
BJP
House Arrest

More Telugu News