Dakshna: సైకో చేసే హత్యల చుట్టూ తిరిగే 'దక్షిణ' .. ట్రైలర్ రిలీజ్!

Dakshina Movie trailer released
  • మంత్ర .. మంగళ దారిలో 'దక్షిణ'
  • దర్శకత్వం వహించిన ఓషో తులసీ రామ్ 
  • సైకో కిల్లర్ చుట్టూ తిరిగే కథ 
  • పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా 

వెండితెరపై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ .. సైకో థ్రిల్లర్ సినిమాలు తమ జోరును కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ తరహా సినిమాలకు ఓటీటీ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి మరో సైకో థ్రిల్లర్ సినిమా వస్తోంది. ఆ సినిమా పేరే 'దక్షిణ'. అశోక్ షిండే నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు ఓషో తులసీరామ్.

ఓషో తులసీరామ్ అనగానే ఆయన నుంచి ఇంతకుముందు వచ్చిన 'మంత్ర' .. 'మంగళ' సినిమాలు కళ్లముందు కదలాడతాయి. ప్రేక్షకులను భయపెట్టడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంటుంది. అందువలన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతూ వెళుతోంది. అలాంటి ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

ఒక సీరియల్ సైకో కిల్లర్ అందమైన యువతులను చంపుకుంటూ వెళుతుంటాడు. ఆతనిని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ గా ధన్సిక రంగంలోకి దిగుతుంది. ఈ కేసు విషయంలో ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది కథ. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 

  • Loading...

More Telugu News