ప్రియాంక గాంధీ కూతురుపై పోస్టు.. కేసు నమోదు చేసిన పోలీసులు
- మిరయా గాంధీ పేరుమీద రూ.3 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయంటూ ట్వీట్
- జనాలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు
- ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హిమాచల్ ప్రదేశ్ పోలీసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరయా గాంధీపై ట్వీట్ చేసిన అనూప్ వర్మ ఐడీని పరిశీలించామని, ఆయన ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్, డిఫెన్స్ అనలిస్టునని ట్విట్టర్ ఖాతాలో చెప్పుకున్నాడని వివరించారు. అనూప్ వర్మను గుర్తించేందుకు సైబర్ సెల్ సాయం కోరినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేయడం, ఇతరుల గౌరవాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టడం నేరమని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.