Crime News: హైటెక్ దొంగ.. 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించి కోట్లు కొట్టేశాడు!

Delhi man took over 200 flights to steal jewellery and cash worth crores
  • తొలుత రైళ్లలో దొంగతనాలు చేసి పోలీసులకు దొరికిన రాజేశ్‌కపూర్
  • సేఫ్‌గా ఉంటుందని విమానాలు ఎంచుకున్న వైనం
  • దేశంలోని దాదాపు అన్ని ముఖ్య విమానాశ్రయాల్లోనూ చోరీలు
  • ఢిల్లీలో సొంత గెస్ట్‌హౌస్
  • భారీగా బంగారు, వెండి నగల స్వాధీనం

రైళ్లలో దొంగతనాలకు పాల్పడి దొరికిపోయి పోలీసు దెబ్బ రుచి చూసిన ఓ దొంగ ఆ తర్వాత రూటు మార్చాడు. ఈసారి విమానాల్లో ప్రయాణిస్తూ విలువైన బంగారు, వెండి వస్తువులను దోచుకునేవాడు. అలా వంద రోజుల్లో ఏకంగా 200 విమానాల్లో ప్రయాణించి చేతివాటం ప్రదర్శించాడు. అలా కోట్ల రూపాయల విలువైన వస్తువులు కొల్లగొట్టాడు. విమానాశ్రయాల్లో విలువైన వస్తువులను పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు వరుసగా ఫిర్యాదు చేస్తుండడంతో అనుమానించి ఎయిర్‌పోర్టుల్లోని సీసీటీవీలు పరిశీలించారు. అన్నింటిలోనూ ఒకే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్ నుంచి రూ. 7 లక్షల విలువ చేసే ఆభరణాలు మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ప్రయాణికుడు కూడా రూ. 20 లక్షల విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేశాడు. దేశంలోని పలు విమానాశ్రయాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులే రావడంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీలు గాలించి ఢిల్లీలోని పహర్‌గంజ్‌కు చెందిన రాజేశ్‌కపూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చింది.

విమానాశ్రయంలోకి ప్రవేశించాక వయసు పైబడిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారితో మాటలు కలిపేవాడు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయాలను బ్యాగేజీ స్లిప్‌ల ద్వారా తెలుసుకునేవాడు. దానిని బట్టి వారి బ్యాగేజీల్లో ఏమేమి ఉండొచ్చో అంచనాకు వచ్చేవాడు. విమానంలోకి వెళ్లాక ఏదో ఒకసాకు చెప్పి తన సీటును వారి పక్కకి మార్చుకునేవాడు. ప్రయాణికులు ఇంకా లోపలికి వస్తున్న సమయంలో అదును చూసి బ్యాగేజీ సర్దుతున్నట్టు నటించి సామాన్లు కొట్టేసేవాడు.

నిందితుడు రాజేశ్‌కపూర్‌కు ‘రిక్కీ డీలక్స్’ పేరిట ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో సొంత గెస్ట్‌హౌస్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అక్కడే అతడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అతడు మనీ ఎక్స్‌చేంజ్ వ్యాపారం చేయడంతోపాటు మొబైల్ రిపేర్ షాపును నిర్వహించేవాడు. ఆ తర్వాత చోరీల బాటపట్టి అందినకాడికి దోచుకోవడం మొదలుపెట్టాడు. దొంగిలించిన బంగారు, వెండి నగలను పక్క వీధిలోనే ఉండే వ్యాపారికి విక్రయించాడు. అతడి ఇంటి నుంచి పెద్దమొత్తంలో బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News