మీ ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటారని ఆశిస్తున్నా: వైఎస్ షర్మిల
- మీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డ అనుకుని ఆశీర్వదించాలని కోరిన షర్మిల
- కడప గడ్డపై న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్య
- న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నానన్న షర్మిల
సోమవారం జరిగే పోలింగ్ లో ఎంపీ బ్యాలెట్ నమూనాలో ఉన్న హస్తం గుర్తుపై బటన్ నొక్కి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగు చాచి అడుగుతున్నానని అందులో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు కడప ఎంపీ స్థానానికి పోటీచేస్తోందని...కడప గడ్డ మీద న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో మీరంతా న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు.