28,000 ఫోన్లను బ్లాక్ చేయండి.. డాట్ కీలక ఆదేశాలు
- 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫికేషన్ చేయాలంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు సూచన
- సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలలో టెలికం వనరుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
- డాట్‌కు సహకరించనున్న కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసులు
కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసుల విశ్లేషణ ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు వివిధ సైబర్ క్రైమ్‌లలో దుర్వినియోగమయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌లతో ఏకంగా 20 లక్షల నంబర్లు ఉపయోగించారు. ఈ సమస్యకు చెక్ పెట్టడంలో భాగంగా 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలని, ఈ హ్యాండ్‌సెట్‌లకు అనుసంధానించిన 20 లక్షల మొబైల్ కనెక్షన్‌లను తిరిగి నిర్ధారించుకోవాలని టీఎస్‌పీలకు డాట్ స్పష్టం చేసింది. రీ-వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయిన కనెక్షన్లను తొలగించాలని సూచించింది.