ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవద్దు.. భారత్ వైద్య పరిశోధన మండలి సూచన
- భారతీయులు తినాల్సిన పోషకాహారంపై ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎస్ అధ్యయనం
- 55.4 శాతం ఆరోగ్య సమస్యలు పోషకాహార లోపంతోనే అని అధ్యయనంలో వెల్లడి
- పప్పు దినుసులు, మాంసం, ధాన్యాలు, పాలు వంటివి తగు మోతాదులో తినాలని సూచన
- పోషకాహారం, కసరత్తులతో జీవనశైలి వ్యాధుల అవకాశం 80 శాతం వరకూ తగ్గుతుందన్న ఐసీఎమ్ఆర్
ఎన్ఐఎన్ సూచించిన మార్గదర్శకాలు..
- రోజులో తీసుకునే మొత్తం కేలరీలలో చక్కెర 5 శాతానికి మించకూడదు. తృణధాన్యాలు 45 శాతానికి మించకూడదు. పప్పు దినుసులు, మాంసం వంటివి 15 శాతం దాట కూడదు. మిగతాది గింజలు, ఆకుకూరలు, పళ్లు, పాలు ద్వారా అందాలి. కొవ్వులు 30 శాతం దాటకూడదు
- పప్పు దినుసులు, మాంసం అధిక ధరల కారణంగా అనేక మంది ధాన్యాలపై ఎక్కువగా ఆధారపడి కీలక అమైనోయాసిడ్లు తీసుకోవడంలేదని కూడా ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో తెలిసింది.
- శరీరంలో కీలక పోషకాలు తగ్గితే జీవ్రక్రియల వేగం కుంటుపడి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఫలితంగా చిన్నతనంలోనే జీవనశైలి రోగాల బారిన పడాల్సి వస్తుంది.
- ఈ అధ్యయనంలో ప్రకారం దేహంలో 55.4 శాతం ఆరోగ్య సమస్యలు సమతుల పోషకాహార లోపం కారణంగానే తలెత్తుతున్నాయి.
- పోషకారం, ఎక్సర్సైజుల ద్వారా గుండె సంబంధిత , బీపీ వంటి సమస్యలను నిరోధించే అవకాశం 80 శాతం వరకూ ఉంటుంది.