రోజాను భరించే శక్తి నగరికి లేదు: సీపీఐ నారాయణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోజాను భరించే శక్తి నగరికి లేదు: సీపీఐ నారాయణ

Nagari people can not bear Roja any more says Narayana
  • రోజా అంతులేని అవినీతికి పాల్పడ్డారన్న నారాయణ
  • ఊళ్లకు ఊళ్లు దోచేశారని మండిపాటు
  • ఎన్నికల్లో రోజాను సాగనంపాలని పిలుపు
ఏపీ మంత్రి రోజాపై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. నగరి నియోజకవర్గంలో రోజా ఊళ్లకు ఊళ్లనే దోచేసిందని ఆయన విమర్శించారు. అంతులేని అవినీతికి పాల్పడిందని అన్నారు. రోజా పాలనలో నగరిలో అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. రోజా రాజకీయ కక్షలు కూడా పరాకాష్ఠకు చేరుకున్నాయని అన్నారు. 

మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాతో నియోజకవర్గాన్ని రోజా పూర్తిగా దోచుకుందని విమర్శించారు. రోజాను ఇకపై ఏమాత్రం భరించే శక్తి నగరి ప్రజలకు లేదని చెప్పారు. ఎంతో పవిత్రంగా జరుపుకునే గంగమ్మ జాతరలో... ఏ విధంగా అయితే చివరి రోజున గంగమ్మను ఊరి బయట వేస్తామో... అదే విధంగా ఎన్నికల్లో రోజాను ఇంటికి సాగనంపాలని అన్నారు. రోజా మరోసారి గెలిస్తే ఆమెను ఎవరూ భరించలేరని చెప్పారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
CPI Narayana
Roja
YSRCP

More Telugu News