అన్నా... మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తున్నావ్: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో మల్లారెడ్డి
- ఓ వేడుకలో ఎదురెదురుపడిన ఈటల రాజేందర్, మల్లారెడ్డి
- తమ ఇద్దరినీ ఫొటో తీయాలని కోరిన మాజీ మంత్రి
- కాసేపు సరదాగా మాట్లాడుకున్న ఈటల, మల్లారెడ్డి
శుక్రవారం హైదరాబాద్‌లోని కండ్లకోయ కేఎస్ఎఆర్ ఫంక్షన్ హాలులో ఓ వివాహ వేడుకలో మల్లారెడ్డి, బీజేపీ మల్కాజ్‌గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... 'అన్నా, మల్కాజ్‌గిరి నుంచి నువ్వే గెలుస్తున్నావ్' అంటూ ఈటలను కౌగిలించుకున్నారు. ఇక్కడి నుంచి ఈటల గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. మా అన్నతో (ఈటల) ఫోటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరారు. దీంతో అక్కడున్న వారు వారిద్దరినీ ఫొటో తీశారు. వారిద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.