తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్
- గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి
- అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి ఉపఎన్నిక
- ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించిన కేసీ వేణుగోపాల్
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఈ స్థానానికి ఉపఎన్నిక జరపనున్నారు. ఓటర్ల జాబితా కూడా వెలువరించారు. ఈ ఎన్నికలకు మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకున్నారు.