బీఆర్ఎస్ 8 సీట్లు గెల్చుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి ఛాలెంజ్
- మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
- టచ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని సవాల్
- తాము 12 ఎంపీ సీట్లను గెలవబోతున్నామంటూ ధీమా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 25 మంది తనతో టచ్ లో ఉన్నారని, బీఆర్ఎస్ లోకి వచ్చేస్తామని అంటే తానే వద్దన్నానని కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా కోమటిరెడ్డి స్పందించారు. తమతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు తాము వెల్లడిస్తామని, కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ఆయన చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించేందుకు తాను సిద్ధమని చెప్పారు. అర్భకులం కాదు.. అర్జునులమై పోరాడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి వివరించారు.