Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై ఈసీకి మరో ఫిర్యాదు

Complaint to EC on Pawan Kalyan
  • నామినేషన్ ర్యాలీలో జాతీయ పతాకాన్ని వినియోగించారని ఫిర్యాదు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన జర్నలిస్టు నాగార్జున రెడ్డి
  • జాతీయ పతాకాన్ని వినియోగించడంపై అభ్యంతరం

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలోని అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో తమ ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు, నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతోంది. అభ్యర్థులు భారీ ర్యాలీగా వెళ్తూ నామినేషన్లు వేస్తున్నారు. ఇదే సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది. పిఠాపురంలో జరిగిన నామినేషన్ ర్యాలీలో పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని వినియోగించారంటూ నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని వినియోగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు పిఠాపురంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనను కూటమి సభ్యులు ఉల్లంఘించారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.

  • Loading...

More Telugu News